
పవన్ కళ్యాణ్ తీరే అంత. తాను వినాలనుకున్నవే వింటారు.. చూడాలనుకున్నవే చూస్తారు.. మాట్లాడాలనుకున్నవే చెబుతారు.. అన్ని విషయాలమీద స్పందించాలంటే తన పొలిటికల్ పార్టనర్ చంద్రబాబు అనుమతి ఉండాలి. అందుకే ఆయన అనుమతి లేకుండా మాట్లాడగలిగేవి.. ఇతరత్రా అంశాల మీద మాత్రం పవన్ కళ్యాణ్ కల్లు తాగి నిప్పు తొక్కిన కోతి లాగా ఎగిరెగిరి పడతారు తప్ప.. ముఖ్యమైన అంశాల విషయంలో మాత్రం "ఏమో సార్ మాకు కనపడ దూ" అన్నట్లుగా ఉంటారు.
ప్రతిపక్షాల మీద ఎగరడానికి మాత్రం ముందు నిలబడే పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించిన ఓ జిల్లా అధికారిని తెలుగుదేశం ఎమ్మెల్యే లం** అంటూ బూతులు తిట్టినా కిక్కురుమనడం లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రేరేపించగా పోలీసులు ఇష్టానుసారం తమ నాయకులపై కేసులు పెడుతున్నారు. జిల్లాలో పోలీసులు అండగా మద్యం దందా నడుస్తోంది. డీఐజీలు.. కొంతమంది సీఐలు మాఫియా డాన్లుగా ఉంటున్నారు అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య చేసిన ఆరోపణలపై క్షణంలో పవన్ కళ్యాణ్ స్పందించేశారు. పోలీసులను ప్రభుత్వ అధికారులను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. వెంటాడి కొడతాం అన్నట్లుగా మాట్లాడారు.
అదే జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ల చేతుల్లో తన్నులు తింటున్నారు కనిపించినట్లు.. వినిపించనట్లుగా పవన్ కళ్యాణ్ ఉంటారు. దీంతోపాటు తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి వినుత ఏకంగా తన డ్రైవర్ రాయుడిని హత్య చేసిన విషయంలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ విషయంలోనూ పవన్ కళ్యాణ్ చెవిటి వాడిలా నటిస్తూ ఉన్నారు. ఈలోపు..
తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) నాగరాజును పదిమందిలో నిలదీసి ఇష్టానుసారం బూతులు తిట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. అయినా అది తనకు సంబంధం లేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు.
వాస్తవానికి డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కాగా ఆ శాఖను సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అంటే తన శాఖకు చెందిన అధికారిని ఓ టిడిపి ఎమ్మెల్యే ఇష్టానుసారం బూతులు తిట్టినా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండిపోతారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ తన శాఖను కూడా సమర్థంగా నిర్వహించలేరా.. తన శాఖ అధికారులను సైతం రౌడీలాంటి టిడిపి ఎమ్మెల్యేల నుంచి కాపాడలేరా అనే విమర్శలు లో వస్తున్న అధికారులు ఎవరూ బయటికి కిక్కురుమనడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిహార వీరమల్లు సినిమా రిలీజ్ కలెక్షన్లు.. థియేటర్లు అనుమతులు.. టికెట్లు పెంపుదల... వంటి అంశాల్లో తలమునకలై ఉన్నారు ఇలాంటి బిజీ టైంలో అధికారుల బాధలు..అవమానాలు వంటి చిన్న చిన్న అంశాలు ఆయన దృష్టికి తెస్తే ఎలా అని జనసైనికులు అంటున్నారు.
- సిమ్మాదిరప్పన్న