నవశక రాజకీయానికి సీఎం జగన్‌ శ్రీకారం: సజ్జల

Vaishnava Community State Leaders Meeting At YSRCP Central Office - Sakshi

అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే దిశగా సీఎం అడుగులు

వైష్ణవ కులసంఘం రాష్ట్ర నేతల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని.. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

చాత్తాద శ్రీ వైష్ణవ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్ పనిచేస్తున్నారన్నారు.

సీఎం వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్‌ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్‌ జగన్‌ది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top