డ్రైవర్లకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

Vaccination is mandatory for drivers says Narayanaswamy - Sakshi

డిప్యూటీ సీఎం నారాయణస్వామి 

కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ చేపట్టిన విధంగానే, ప్రజలతో నిత్యం సంబంధాలుంటున్న ట్యాక్సీ, బస్సు, ఆటో డ్రైవర్లకు వ్యాక్సిన్‌ అందించాలన్నారు.

జిల్లా కలెక్టర్లు కరోనా నివారణపై యుద్ధ ప్రాతిపదికన అవగాహన కల్పించి కరోనా మరణాల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చే వారికి భారీగా జరిమానా విధించి కరోనా కట్టడికి పోలీస్‌ యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధికంగా వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారని గుర్తుచేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top