తప్పుల తడకగా ఓటరు జాబితా | A transparent voter list must be prepareds says ysrcp | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా ఓటరు జాబితా

Jun 18 2026 3:53 AM | Updated on Jun 18 2026 3:53 AM

A transparent voter list must be prepareds says ysrcp

సవరించకపోతే న్యాయపోరాటం

అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారకూడదు

పారదర్శకమైన ఓటరు జాబితాను తయారు చేయాలి

వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

60 ఏళ్లుగా ఉన్న ఇల్లే మాయం: మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష

2002లో ఎమ్మెల్యేగా చేసిన నా పేరే లేపేశారు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి

వైఎస్సార్‌సీపీ ఓట్లను ఏరివేసేందుకు ‘సర్‌’ ముసుగులో కూటమి పచ్చ కుట్రలు

అధికారుల ఏకపక్ష వైఖరిపై కోర్టుకు వెళ్తామన్న వైఎస్సార్‌సీపీ నేతలు

కడప కార్పొరేషన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ముసుగులో వైఎస్సార్‌సీపీ ఓట్లను గంపగుత్తగా తొల­గించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘు­రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవా­రం కడపలో విలేకరుల సమావేశంలో వారు ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌లో ఉంచిన ఓటరు జాబితాలోని ఘోరాలను సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టారు. తప్పు­లను సవరించకపోతే న్యాయ పోరాటం చేస్తా­మని హెచ్చరించారు. అధికారులు అధికార పార్టీ తొ­త్తు­లుగా మారకుండా,  పారదర్శక­మైన ఓటరు జాబి­­తాను తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నా­రు.

నా డోర్‌ నంబరే లేదు: అంజద్‌ బాషా
కడపలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ వీధిలో ఉన్న డోర్‌ నంబర్‌ 19/420 ఇంటిలో నేను 60 ఏళ్లుగా ఉంటున్నాను. నేను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే. 30 ఏళ్లుగా ఇదే చిరునామాపై ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. 2005లో కార్పొరే­టర్‌గా, 2014, 2019లో రెండు సార్లు శాసన సభ్యుడిగా గెలిచి డిప్యూటీ సీఎంగా సేవలు అందించాను. అలాంటి నా డోర్‌ నంబరే ఓటరు లిస్టులో లేదు. 

జాబితాలో 19/417 నుంచి 19/425 వరకు అసలు డోర్‌ నంబర్లే గల్లంతు చేశారు. మా లాంటి ప్రజాప్రతినిధుల ఇళ్లను, ఓట్లనే మాయం చేస్తే ఇక సామాన్య ఓటరు పరిస్థితేమిటి? ఒక్కో పోలింగ్‌ బూత్‌లో కనీసం 50 ప్రతిపక్ష ఓట్లను తగ్గించాలనే దుర్బుద్ధితోనే ఈ అస్తవ్యస్త జాబితాను తెచ్చారు. బీఎల్‌ఓలు దరఖాస్తు ఫారాలు ఇళ్ల వద్ద పడేసి వెళ్తున్నారే తప్ప వాటిని ఎలా నింపాలో ప్రజలకు చెప్పడంలేదు. తక్షణమే ఈ తప్పుల తడక జాబి­తాను సవరించకపోతే న్యాయపోరాటం చేస్తాం.

2002లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత ఓటరు జాబితాలో నా పేరు లేదు: శెట్టిపల్లె రఘురామిరెడ్డి
2002లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అయినా ప్రస్తు­త ఓటరు జాబితాలో నా పేరే లేకపోవడం ఆశ్చర్యకరం. నా స్వగ్రామమైన చాపాడు మండలం నక్కలదిన్నెలో 2002 ఓటరు లిస్టు ప్రకారం 1142 ఓట్లు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. కానీ, ఆ జాబితాలో నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లుగానీ, కనీసం మా గ్రామస్తుల పేర్లు­గానీ ఎక్కడా లేవు. నక్కలదిన్నె లిస్టులో రాజు­పాలెం గ్రామానికి చెందిన వారి పేర్లను చొప్పించి తారుమారు చేశారు.

వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వచ్చిన పోలింగ్‌ బూత్‌లను టార్గెట్‌ చేసి ఓటర్లను తగ్గించడమే వీరి లక్ష్యం. నక్కలదిన్నె గ్రామంలో 2014లో 6,200 ఓట్లు, 2019 నాటికి 8,400 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నింటినీ అక్రమంగా ఏరివేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. అధికారులకు ఈ తప్పులు చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. దేశీ మద్యం విక్రయాలకు అనుమతి లేదు.  

» ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంట­ల వరకు మద్యం విక్రయాలు ఉంటాయి. 
»   విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌ల్లో ఏర్పాటు చేసే బీచ్‌ బార్లకు మూడేళ్ల కాలపరిమితితో లైసెన్స్‌ మంజూరు చేస్తారు. ఈ ఏడాది సెపె్టంబరు 1 నుంచి 2029 ఆగస్టు 31 వరకు లైసెన్స్‌ గడువుగా 
నిర్ణయించారు.  
»  లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసే వారు రూ.2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజుతోపాటు రూ.10వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి. వార్షిక రీటైల్‌ ట్యాక్స్‌(ఆర్‌ఈటీ) మొదటి ఏడాది రూ.7.50లక్షలు చెల్లించాలి. ఆర్‌ఈటీ ఏటా 10శాతం పెంచుతారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement