
మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన టమాటా
టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది.
మదనపల్లె (చిత్తూరు): టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి దెబ్బతినడం, అందుబాటులో ఉన్న టమాటా నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడం లేదు.
మదనపల్లె మార్కెట్‌కు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్పాడు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల నుంచి రైతులు బుధవారం మార్కెట్‌కు 189 మెట్రిక్‌టన్నుల టమాటాను తీసుకొచ్చారు. ఈ వారంలో సోమవారం మొదటి రకం కిలో టమాటా ధర రూ.38, మంగళవారం రూ.36 పలికితే బుధవారం రూ.42కు చేరుకోవడం విశేషం.
చదవండి:
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు