
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. మద్యం బార్లకు నేడు లక్కీ డ్రా ఉన్న నేపథ్యంలో దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ ప్లాన్ రచిస్తోంది. ఈ క్రమంలో మార్జిన్ పెంచుకునేందుకు బార్ల సిండికేట్ కొత్త ఎత్తుగడ చేసింది.
వివరాల ప్రకారం.. ఏపీలో మద్యం బార్ల కోసం టీడీపీ సిండికేట్ కుట్రలు చేస్తోంది. దరఖాస్తులు రాకుండా టీడీపీ సిండికేట్ కొత్త ప్లాన్‌కు దిగింది. బార్లకు దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంటోంది. కాగా, నిన్న రాత్రితో బార్ దరఖాస్తుల గడువు ముగిసింది. దీంతో, నేడు 840 బార్లలో 465 బార్లకు లక్కీ డీప్ తీయనున్నారు. 465 బార్లకు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తులను తగ్గించే ప్రయత్నం చేసి.. మార్జిన్‌ను పెంచుకునేందుకు పచ్చ నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇక, ఇప్పటికే సిండికేట్ కోసం ఒకసారి లాటరీని ఎక్సైజ్ శాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే.