మద్యం మత్తులో కత్తితో టీడీపీ నేత హల్‌చల్‌ | TDP leader Hulchul In Penumaka | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కత్తితో టీడీపీ నేత హల్‌చల్‌

Apr 27 2026 5:00 AM | Updated on Apr 27 2026 5:00 AM

TDP leader Hulchul In Penumaka

(ఇన్‌సెట్‌లో) యువకుడిపైకి కత్తి పట్టుకుని దూసుకువెళుతున్న ప్రదీప్‌ , మంత్రి లోకేశ్‌తో కూనపురెడ్డి ప్రదీప్‌ (ఫైల్‌),

సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఘటన

ఉండవల్లి నుంచి పెనుమాక వెళ్లి కత్తితో బెదిరింపులు 

భయభ్రాంతులకు గురైన ప్రజలు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాసానికి అతికొద్ది దూరంలో, మంత్రి లోకేశ్‌ నియోజకవర్గమైన మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలో పెనుమాకలో శనివారం అర్ధరాత్రి టీడీపీ నేత మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన ఘటన వెలుగుచూసింది. టీడీపీ కార్యకర్త కూనపురెడ్డి ప్రదీప్‌ కత్తితో వీరంగం సృష్టించాడు. నేనెవరినైనా చంపుతా, ఇది నా అడ్డా అంటూ అక్కడున్న టీడీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను సుమారు గంటపాటు భయభ్రాంతులకు గురిచేశాడు. ‘మీరెవరూ లోకేశ్‌ను కలవలేరు. నేను మా శేషన్నతో కలసి డైరెక్ట్‌గా లోకేశ్‌ను కలుస్తా.

మీరు వీడియోలు తీసుకున్నా ఎవరూ ఏమీ చేయలేరు. కనీసం ఏ పేపరు, టీవీల్లో కూడా వార్త రాదు. శేషన్న చూసుకుంటాడు. శేషన్నకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా చంపేస్తా’అంటూ బెదిరించాడు. అక్కడున్న వారు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో విషయం బయటపడింది. ఇతను గతంలోనూ ఉండవల్లిలో కత్తులతో వీరంగం చేసినట్లు టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరైనా కత్తులు, కర్రలు పట్టుకుని తిరిగితే వారి తాట తీస్తాం అంటూ బీరాలు పలుకుతున్న హోం మంత్రి అనిత ఇటువంటి ఘటనలపై నోరెత్తకపోవడం కొసమెరుపు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement