వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’

చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.