ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల | Sub Inspector Post Results Out In Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఎస్సై ఫలితాలు విడుదల

Dec 22 2023 4:31 PM | Updated on Dec 22 2023 5:24 PM

Sub Inspector Post Results Out In Andhra pradesh - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎస్సై పోస్టుల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఎస్సై పోస్టులకు మొత్తం 315 మంది ఎంపికయ్యారు. వీరిలో 102 మంది మహిళలు ఉన్నారు. సివిల్‌, ఎపీఎస్పీ విభాగాల్లో ఎస్సైల ఎంపిక జరిగింది. 

విశాఖ జోన్‌లో 50, ఏలూరు జోన్‌లో 105, గుంటూరు జోన్‌లో 55, కర్నూలు జోన్‌లో 105 మంది ఎంపియ్యారు.  ఎస్సై పరీక్షల్లో గోనబోయిన విజయ భాస్కరరావు, మహిళల్లో లోగిస కృష్ణవేణి టాపర్‌గా నిలిచారు. త్వరలో ఎంపికైన వారికి సర్టిఫికెట్లు పరిశీలన, మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement