కొత్త మొక్కను కనుగొన్న ఎస్వీయూ శాస్త్రవేత్తలు 

Sri Venkateswara University Scientists Discover New Plant - Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌(చిత్తూరు జిల్లా) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, యుగంధర్, బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన కేటగిరీ–ఈ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌జీ సింగ్‌ ‘క్రోటాలేరియా లామెల్లిఫారి్మస్‌’ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాస కోన, పూడి ప్రాంతాల్లో ఈ మొక్కను గుర్తించారు.

ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ప్రచురించింది. దీనిపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలల్లో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తేలింది. శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ మొక్క గడ్డిలో కలిసిపోయి పగటి పూట సరిగా కనిపించదన్నారు. 10 సెం.మీ ఎత్తు పెరుగుతుందని తెలిపారు. పుత్తూరు సమీపంలోని దుర్గం ప్రాంతంలోనూ ఈ మొక్కలున్నట్టు తాజాగా గుర్తించామన్నారు. దీని  ఇతర లక్షణాలపై భవిష్యత్‌ పరిశోధనలు చేస్తామని శివరామకృష్ణ, యుగంధర్‌ తెలిపారు.
చదవండి:
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు   
అక్రమాల పుట్ట ‘అమరావతి’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top