పడవలు బోల్తా ఘటన: ఆరుగురి మృతదేహాలు లభ్యం

Six Bodies Found In Boats Capsize Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సీలేరు నదిలో నాటుపడవలు బోల్తా ఘటనలో గల్లంతైన వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చీకటి పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశారు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం రేపు(బుధవారం) గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటన విదితమే. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు. హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో  35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో ఐదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి.11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి.

చదవండి: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం
విషాదం: అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఆత్మహత్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top