
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి,అమరావతి: వెనుకబడిన వర్గాలలోని ప్రతి బిడ్డ... సంపన్న వర్గాల పిల్లలకు పోటిగా విద్యనభ్యసించాలనేది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుదవారం నిర్వహించిన రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ఉనికిని కాపాడేందుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.
వైఎస్సార్‌సీపీ కులాల రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పార్టీ కాదని, వైఎస్ జగన్‌కు పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చేలా రాజకీయాలు చేయడం రాదని సజ్జల అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ది పొంది అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన వాఖ్యానించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.