ఏపీలో లాక్‌డౌన్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు

Sjjala Ramakrishna Reddy Comments About Lockdown In AP - Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉంది.. కానీ లాక్‌డౌన్‌ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది అన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలి. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు’’ అని సజ్జల తెలిపారు.

‘‘ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం జగన్‌ పాలన చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం జగన్‌ పాలన ఉంది. మా పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుంది’’ అన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సజ్జల. ‘‘చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు.. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నారు. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అని సజ్జల సూచించారు.

చదవండి: ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడడమా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top