సాక్షి, విజయవాడ: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్‌లు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, మూడు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు.
ఏపీలో దాదాపు 50 శాతం వరకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మూడు రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి.. గంటల సమయంలో క్యూలైన్‌లోనే ఉండాల్సి వస్తోంది. కాగా, అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్‌లు మూతపడినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోల్ , డీజిల్ కొరత తో అల్లాడి పోతున్న వాహనదారులు
పెట్రోలు బంకుల వద్ద నోస్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో ఆందోళన చెందుతున్న వాహనదారులు
పెట్రోలు దొరకదు అనే భయంతో అదుపు తప్పుతున్న వాహనాదారులు,
గంటల కొద్దీ గా పెట్రోల్ కోసం ఖాళీ బాటిల్స్, వాహనాలతో బారులు తీరన వాహనదారులు.… https://t.co/EZRqDjo0A0 pic.twitter.com/vNGXpHVIdz— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) April 25, 2026
విజయవాడ..
తీవ్రంగా డీజిల్, పెట్రోల్ కొరత.
రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు
విజయవాడ నగర పరిధిలో ఇప్పటికే మూతబడ్డ పలు బంక్‌లు
బందరు రోడ్డులోని సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద భారీగా క్యూకట్టిన వాహనదారులు
చుట్టుపక్కల ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద అర కిలోమీటర్ మేర క్యూ
కార్ల కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఏర్పాటు చేసిన పోలీసులు
రేషన్ పద్ధతిలో బైక్‌కు 300 పెట్రోల్, కారుకు 1000 రూపాయల డీజిల్ ఫిల్ చేస్తున్న వైనం
డీజిల్ కోసం గంటల తరబడి బంక్‌ల వద్ద నిరీక్షిస్తున్న వాహనదారులు
కాకినాడ జిల్లా
మూడవ రోజు కూడా బంకుల వద్ద డీజిల్ కోసం బారులు తీరిన వాహనాలు
కార్లకు రూ.1,000, ఆటోలకు 3 లీటర్ల చొప్పున డీజిల్ కొడుతున్న బంకులు
డీజిల్ కోసం గంటల తరబడి నిరీక్షణ
డీజిల్ సరఫరా లేక కొన్ని చోట్ల దర్శనమిస్తున్న సో స్టాక్ బోర్టులు.
తూర్పుగోదావరి జిల్లా..
అనపర్తి నియోజకవర్గంలో కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత.
స్టాక్ లేదని బంకుల్లో బోర్డులు పెట్టిన యాజమాన్యం.
వరి చేలు కోతలు సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు.
కృష్ణా జిల్లా..
మచిలీపట్నంలో పెట్రోల్ బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనదారులు
డీజిల్ కొరతతో మూతబడిన పలు బంక్‌లు
పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్న వినియోగదారులు
తిరుపతి
తిరుపతి జిల్లాలో పెట్రోల్ బంకులు వద్ద క్యూ కడుతున్న వాహనదారులు
తిరుపతి నగరంలో పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరిన వాహనాలు.
- తిరుమలలో భక్తులకు తప్పని తిప్పలు
- నిన్నటి నుండి పెట్రోల్, డీజల్ తిరుమలలో ఖాళీ.
- నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్ బంకులు
- ఇబ్బందుల కారణంగా టీటీడీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్న భక్తులు.
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత- పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు! pic.twitter.com/SgNOOmlJnG
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) April 25, 2026


