బీసీల అభ్యున్నతే వైఎస్సార్‌సీపీ ధ్యేయం | Peddireddy Ramachandra Reddy Speech At YSRCP BC Galam Meeting In Anantapur | Sakshi
Sakshi News home page

బీసీల అభ్యున్నతే వైఎస్సార్‌సీపీ ధ్యేయం

Apr 27 2026 3:40 AM | Updated on Apr 27 2026 3:40 AM

Peddireddy Ramachandra Reddy Speech At YSRCP BC Galam Meeting In Anantapur

సభలో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకు బీసీలంతా సిద్ధం   

బీసీ గళం సభలో వక్తలు  

అనంతపురం : బీసీల అభ్యున్నతే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని వక్తలు పునరుద్ఘాటించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ అని దేశ చరిత్రలో తొలిసారిగా చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. అనంతపురంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో రాయలసీమ జోనల్‌ స్థాయి ‘బీసీ గళం’సభ నిర్వహించారు.

బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ తదితరులు ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల కంటే అధికంగానే బీసీలకు తోడ్పాటునందించారని గుర్తు చేశారు. వారి అభ్యున్నతికి ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు వెచి్చంచారని పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కలి్పంచే శక్తి వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మద్దతిస్తారని చెప్పారు. బీసీలే టీడీపీకి పట్టుకొమ్మలు అని చెప్పుకునే చంద్రబాబు ఈ రెండేళ్లలో వారి కోసం ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడు­స్తున్నా బీసీలకు ఇచి్చన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించేందుకు బీసీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శైలజానాథ్, శంకరనారాయణ, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement