నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 20న మెగా జాబ్‌మేళా.. పూర్తి వివరాలు | NTR District: Mega Job Mela At Mylavaram On August 20th | Sakshi
Sakshi News home page

Job Opportunities: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 20న మెగా జాబ్‌మేళా

Aug 17 2022 3:54 PM | Updated on Aug 17 2022 3:54 PM

NTR District: Mega Job Mela At Mylavaram On August 20th   - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఈ మేళాలో 16 ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై వారి కంపెనీల్లోని వివిధ విభాగాల్లో 1,900 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటుగా ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్‌ విద్యార్హతలు ఉన్న వారు ఈ మేళాలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ శనివారం మైలవరంలోని డాక్టర్‌ లక్కిరెడ్డి హానిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నామని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఉపాధి శాఖాధికారి డాక్టర్‌ పీవీ రమేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
చదవండి: కేసీఆర్‌ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు 

ఈ మేళాలో 16 ప్రైవేటు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై వారి కంపెనీల్లోని వివిధ విభాగాల్లో 1,900 పోస్టులను భర్తీ చేస్తారని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటుగా ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్‌ విద్యార్హతలు ఉన్న వారు ఈ మేళాలో పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో గాని 86888 42879, 99660 90377 నంబర్లలో కాని పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారు శనివారం జాబ్‌ మేళా జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement