
పార్వతీపురం మన్యం జిల్లా: ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటూ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి స్పందన కరువైంది. ప్రభుత్వ చర్యలతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు.. సభలకు రావడానికి ఇష్టపడటం లేదని విషయం మంత్రి అచ్చెన్నాయుడు చేపట్టిన పార్వతీపురం సభలో తేటతెల్లమైంది. బలవంతంగా ఆటో డ్రైవర్లను ఆయా సభలకు తరలించినా కొన్ని చోట్ల అది సాధ్యం కాలేదు.
అది కూడా తాను టీడీపీలో కీలక నేతగా ఫోజులిచ్చే అచ్చెన్న ‘ ఆటో డ్రైవర్ల సేవలో’ సభలో ఎటు చూసినా టీడీపీ శ్రేణులే కనిపించాయి. మరొకవైపు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా, బోసిగా మెరిసిపోయాయి. రూ. 15వేలను ప్రభుత్వం ఇస్తామని సభకు రమ్మని పిలిచినా ఆటో డ్రైవర్ల నుంచి సరైన స్పందన కాదు కదా.. కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం. ఆ సభలో ార్యకర్తలు తప్ప ఆటో డ్రైవర్‌లు లేకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయచంద్రలు అవాక్కయ్యారు.
చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక దగా, మోసం అంటూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్స్ ఫెడరేషన్ విమర్శల గుప్పించిన నేపథ్యంలో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం వార్తల్లో నిలిచింది. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఇలా విమర్శలు రావడం ఏంటనేది ఒకటైతే, మంత్రి అచ్చెన్న సభలో ఆటో డ్రైవర్లు కనుచూపుమేర కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.

ఇదీ చదవండి:
ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్