ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన

Minister Buggana Rajendranath Speech In AP Legislative Council - Sakshi

మండలిలో 3 రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని.. అన్ని ప్రాంతాల అభివృద్ధి  ప్రభుత్వం ధ్యేయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంగళవారం ఆయన ప్రవేశపెట్టారు.

చదవండి: 'మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా'

అభివృద్ధి వికేంద్రీకరణ రద్దు బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. ఒక ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రత్యేకవాదం వచ్చిందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అందుకే అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చాయి.

చంద్రబాబు ప్రభుత్వం అమాయకుల నుంచి 33వేల ఎకరాలను సేకరించింది. ఎక్కడా లేనట్లు 7500 చ.కి.మీటర్లలో రాజధానిని కడతామన్నారు. 50వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే కనీస అవసరాలకే రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. రాజధాని అంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు. ఒకే చోట అన్ని సంస్థలు పెడితే ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందదు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం ఎంతైనా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top