మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత

Mekathoti Sucharitha Comments Women Safety On Disha App - Sakshi

సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇ‍ప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు.

గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. 

చదవండి: Child Marriages: ప్రతి 100 మంది ఆడపిల్లల్లో 30 మందికి ఈ వయస్సులోపే పెళ్లిళ్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top