బాబుచేతిలో పావు పవన్‌కల్యాణ్‌ 

Malagundla Sankaranarayana Said Chandrababu Using Pawan Kalyan  - Sakshi

సాక్షి, సోమందేపల్లి: సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని చంద్రబాబు... ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. సోమవారం ఆయన సోమందేపల్లిలోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతూ, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

 ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ–1 పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తమ ప్రచారం కోసం చంద్రబాబు కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారన్నారు. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్‌కల్యాణ్‌... ఈ రెండు ఘటనల్లోని బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబుకు  ప్రయోజనం చేకూర్చారని, ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో బాబుకు లబ్ధి కల్పించడానికి తహతహ లాడుతున్నారన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, మాజీ కనీ్వనర్‌ వెంకటరత్నం, జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, ఎస్సీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి     గజేంద్ర, వైస్‌ ఎంపీపీ వెంకట నారాయణరెడ్డి, మైనార్టీ సెల్‌ కనీ్వనర్‌ ఇమాం వలీ, మండల ప్రచార కార్యదర్శి నరసింహ మూర్తి, కో ఆప్షన్‌ సభ్యుడు రఫీక్, సర్పంచ్‌ అంజి నాయక్, కేజీబీవీ పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ రామాంజి, సీనియర్‌ నాయకులు ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి: స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top