Live Updates
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు
అమలాపురం: ప్రభుత్వ తీరుపై మహిళల ఆగ్రహం
- రాష్ట్రంలో మహిళలపై కూటమి పాలనలో జరుగుతున్న అకృత్యాలు నిరసిస్తూ మాజీ ఎంపీ చింతా అనురాధ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆందోళన కార్యక్రమం
- ఈదరపల్లి సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు
- మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన, ప్రభుత్వ తీరు నిరసిస్తూ నినాదాలు
- కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీలు సూర్యనారాయణ, ఇజ్రాయిల్, కోఆర్డినేటర్లు పాముల రాజేశ్వరి గన్నవరపు శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యకర్తలు
కాకినాడ జిల్లాలో కదంతొక్కిన మహిళామణులు
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన
- మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అనిత రాజీనామా చేయ్యాలని డిమాండ్
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేత
ఏలూరులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు, అరాచకాలు నిరసిస్తూ... ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
- ఏలూరు పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన.. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కేసరి సరితా రెడ్డి
- నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు, ఏలూరు ఇన్చార్జ్ జయప్రకాష్
హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి
- కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం మహిళా విభాగం ఆందోళన
- మహిళలపై అఘాయిత్యాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్
- శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
- కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల భారతి, జిల్లా ఉపాధ్యక్షురాలు మెంటాడ పద్మావతితో పాటు పలువురు మహిళా నేతలు
పల్నాడు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
- రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులు అత్యాచారాలు, హత్యలు అరాచకాలు నిరసిస్తూ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మహిళల భారీ ర్యాలీ
- అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వినతి పత్రం ఇచ్చిన సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
- నిరసనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు, కార్యకర్తలు
భీమవరంలో భారీ నిరసన ర్యాలీ
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిరసిస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా
- ప్రకాశం చౌక్ వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టిన జిల్లా మహిళా విభాగం నాయకులు
- పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల
తూర్పుగోదావరిలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతల నిరసన
- కూటమి పాలనలో మహిళలపై అకృత్యాలు నిరసిస్తూ..
- రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు
- కోటిపల్లి బస్సుల నుంచి శ్యామల జంక్షన్ వరకు భారీ ర్యాలీ
- చంద్రబాబు సర్కార్ తీరు నిరసిస్తూ నినాదాలు
- కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన మాజీ హోంమంత్రి తానేటి వనిత, జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, షర్మిలా రెడ్డి, మహిళా విభాగం కార్యకర్తలు
మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన
- వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిరసన
- రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసన
- అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి.. వినతిపత్రం అందజేత
- ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలువుతోంది: ఉప్పాల హారిక
- కూటమి ప్రభుత్వం మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేసింది
- హోంమంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి
- మహిళలపై దాడులు జరుగుతున్నా హోంమంత్రి చర్యలు తీసుకోవడం లేదు
- హోంమంత్రి అనిత తీరు.. స్త్రీ జాతికి అవమానం
- స్త్రీ కన్నీరు పెట్టిన రాజ్యం నాశనమవుతుందన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి
- టీడీపీ నేతలు మహిళను వివస్త్ర చేస్తే.. మేం బాధితులకు అండగా నిలిచాం
- బాధితురాలిని పరామర్శించినందుకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడటం సిగ్గుచేటు
- బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ.. వారికి అండగా నిలిచి పోరాడుతుంది

గుంటూరులో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు
- రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై అరాచకాలు నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన
- లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళల భారీ ధర్నా
- నిరసనలో పాల్గొన్న అంబటి రాంబాబు, పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్ కుమార్, డైమండ్ బాబు, మహిళా నాయకులు
చంద్రబాబు సర్కార్‌పై మహిళా సంఘాల ఆగ్రహం
- మహిళల హత్యాలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా నిరసన
- అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మహిళల ధర్నా
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన
- టీడీపీ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ ప్లకార్డుల ప్రదర్శన
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా మహిళల నినాదాలు
కూటమి సర్కార్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు
తుమ్మలపల్లి కళా క్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన
నిరసనలో పాల్గొన్న వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్
తిరుపతిలో వైఎస్సార్‌సీపీ విభాగం నిరసనలు
- తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు
- కూటమి ప్రభుత్వం పాలనలో మహిళలకు భద్రత కరవు
- రక్షణ కల్పించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళా నేతలు
- చిత్తూరు: దర్గా సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం పత్రం అందించిన వైఎస్సార్‌సీపీ నేతలు
- కూటమి ప్రభుత్వం పాలనలో మహిళా భద్రత గాల్లో దీపంగా మారింది
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని నిరసన చేపట్టిన జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- గుంటూరులో మహిళపై దాడి, వివస్త్రను చేయడంపై నిరసన
- అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలపనున్న మహిళలు
- అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత


