Live Updates
Live Blog: కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు..
యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం
యాదాద్రి భువనగిరి జిల్లా
కార్తీక మాసం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి పోటెత్తిన భక్తులు
ఉదయం నాలుగు గంటల నుంచే క్యూలైన్లో వేచి ఉండి ముక్కులు తీర్చుకుంటున్న భక్తులు
కొండపైన పర్వత వర్ధిని రామాలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు
సత్యనారాయణ స్వామి మండపంలో వ్రతం నిర్వహించుకున్న అనంతరం.. అమ్మవారికి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
భక్తుల హర నామ స్మరణ
సూర్యాపేట జిల్లా..
హుజూర్నగర్ నియోజకవర్గంలో హర నామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు.
మేళ్లచెరువు ఇష్ట కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, హుజూర్నగర్ భీమలింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజామునుండే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు.
రమణీయంగా ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం
వైయస్సార్ జిల్లా ...
ఒంటిమిట్టలో రమణీయంగా రామయ్య కార్తీక పౌర్ణమి కళ్యాణం
సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న టీటీడీ వేద పండితులు
స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పుష్ప మాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరణ
రామయ్య కళ్యాణాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న భక్తులు
కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేత
పాల్గొన్న టీటీడీ ఉన్నతాధికారులు, భారీగా తరలివచ్చిన భక్తులు
కిటకిటలాడుతోన్న శైవక్షేత్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లా
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో కిటకిటలాడుతోన్న శైవక్షేత్రాలు
వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉన్న భీమలింగాన్ని భారీగా దర్శించుకుంటున్న భక్తులు
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు
పెద్దపల్లి జిల్లా
కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు
భక్తులతో కిటకిటలాడుతున్న కోల్ బెల్టు దేవాలయాలు
గిరి ప్రదక్షిణలో భక్తులు
- కాకినాడ జిల్లా..
- కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ
- తొలి తపాంచ నుండి పల్లకి మీద సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్ల ఊరేగింపు
- గిరి ప్రదక్షణలో పాల్గోనేందుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
- మధ్యాహ్నం రెండు గంటలకు ప్రచార రధంపై గిరి ప్రదక్షిణ ప్రారంభం.
భక్తుల సముద్ర స్నానం
- కృష్ణాజిల్లా..
- కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు
- సముద్ర స్నానం ఆచరించి వేణుగోపాల స్వామిని దర్శించుకున్న భక్తులు
కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
- మహబూబ్‌నగర్..
- కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
- కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుణ్య స్థానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్న భక్తులు


