పోలవరం పనులపై కేంద్ర జలశక్తి మంత్రి కీలక ఆదేశాలు

Live Updates: CM YS Jagan Union Minister Sekhawat Polavaram Visit - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌

పోలవరం పనులపై కేంద్ర జలశక్తి మంత్రి  గజేంద్రసింగ్‌ షెకావత్‌ కీలక ఆదేశాలిచ్చారు. సమస్యల పరిష్కారానికి 15రోజులకు ఒకసారి సమీక్ష చేస్తానని తెలిపారు. పెండింగ్ డిజైన్లను ఆమోదించాలన్న ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ నెల 15వ తేదీలోగా డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నిర్వాసితులకు డీబీటీ విధానంలో చెల్లింపుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు.

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమీక్ష చేపట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇరిగేషన్ అధికారులు, ఆర్అండ్ఆర్ అధికారులు హాజరయ్యారు.

పోలవరం పురోగతి పనులను సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌లకు వివరిస్తున్న అధికారులు

పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం.. పోలవరం ప్రాజెక్ట్‌ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌

పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం, కేంద్ర మంత్రి

నిర్వాసితుల జీవనోపాధిపై కార్యాచరణ:సీఎం జగన్‌
నిర్వాసితులకు కేంద్ర ప్యాకేజీతో పాటు రాష్ట్రం కూడా సాయం చేస్తుంది: సీఎం జగన్‌

పోలవరాన్ని వైఎస్‌ఆర్‌ ముందుకు తెచ్చారు: షెకావత్‌
పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు: షెకావత్‌

► తాడువాయి పునరావాస నిర్వాసితులతో సీఎం, కేంద్ర మంత్రి ముఖాముఖి
తాడువాయి చేరుకున్న సీఎం జగన్‌-కేంద్ర మంత్రి షెకావత్‌
తాడువాయి పునరావాస కాలనీని పరిశీలించిన సీఎం, కేంద్రమంత్రి

పునరావాస పనులపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని, పోలవరం పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. వైఎస్సార్‌ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి రూ. 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు.

► పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది.  కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం.. మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తా: కేంద్ర మంత్రి షెకావత్‌.

ఇందుకూరు నిర్వాసితులతో సీఎం జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ ముఖాముఖి

ఇందుకూరు పేట చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌. స్వాగతం పలికిన అధికారులు. నిర్వాసితుల పునరావాస కాలనీ పరిశీలన. 

 దేవీపట్నం మండలం ఇందుకురూ-1 లో నిర్వాసితులతో సీఎం జగన్‌, కేంద్ర జలశక్తి వనరుల మంత్రి షెకావత్‌ మాటామంతి. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో మాట్లాడనున్న సీఎం జగన్‌, కేంద్రమంత్రి షెకాత్‌. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ.

► దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాలకు సంబంధించిన నిర్వాసితుల కోసం ఇందుకూరు -1 కాలనీ ని ఏర్పాటు చేశారు. కాలనీ కి ఇప్పటికే 306 నిర్వాసిత కుటుంబాలు చేరుకున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం బయల్దేరారు. పోలవరం పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో కలిసి సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు బయల్దేరారు. సీఎంవెంట కేంద్ర మంత్రి షెకావత్‌తో పాటు, రాష్ట్ర మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Andhra Pradesh: వడివడిగా వరదాయని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top