ఆదోని, నంద్యాలలో ఆక్సిజన్‌ ప్లాంట్లు : మంత్రి బుగ్గన

Kurnool: Minister Buggana Rajendranath Reddy Review With Officials On Covid - Sakshi

కరోనా కట్టడిపై కర్నూలు అధికారులతో సమీక్ష

కర్నూలు: ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ​ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం సోమవారం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షచేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ఇలా.. ‘కరోనా నివారణ కు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వివరాలు సేకరించాం. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటాం. ఆదోని, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తాం. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు భరోసా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని వివరించారు.

‘రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్ ఇంజెక‌్షన్‌లపై అధికారులు సమన్వయంతో తో పని చేస్తున్నారు. ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే ప్రమాదమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కి చికిత్సతోపాటు భోజనం, మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం అన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముందులు, ఆక్సిజన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందిస్తోంది. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే’ అని మంత్రి బుగ్గన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top