
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): వంగవీటి మోహనరంగాను హత్య చేయించిన టీడీపీని మునిసిపల్ ఎన్నికల్లో ఓడించి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు కాపు కులస్తులకు పిలుపునిచ్చారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ ప్రశ్నించని పవన్‌కల్యాణ్ ఇప్పుడు ప్రజాభిమానంతో సీఎం అయిన జగన్‌ను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు జనసేనకు ఓటు వేయాలని ప్రచారం చేయడం వింతగా ఉందన్నారు. విజయవాడ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు.