AP: వావ్‌.. వాట్‌ ఏ గ్రేట్‌ మెనూ.. జపాన్‌ వాసుల కితాబు  | Japanese Praised Mid Day Meal Scheme In Ap | Sakshi
Sakshi News home page

AP: వావ్‌.. వాట్‌ ఏ గ్రేట్‌ మెనూ.. జపాన్‌ వాసుల కితాబు 

Dec 30 2023 9:14 AM | Updated on Dec 30 2023 5:21 PM

Japanese Praised Mid Day Meal Scheme In Ap - Sakshi

కె.గొల్లపల్లె ఉన్నత  పాఠశాలలో జపాన్‌ దేశస్తులతో ఉపాధ్యాయులు

చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్‌ దేశస్తులు శుక్రవారం సందర్శించారు

యాదమరి(చిత్తూరు జిల్లా): వాట్‌ ఏ గ్రేట్‌ మెనూ.. యువర్‌ సీఎం కేరింగ్‌ ఈజ్‌ సూపర్‌ ఆన్‌ మిడ్‌ డే మీల్స్‌ అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డిపై జపాన్‌ వాసులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు.. పాఠశాలలో అమలవుతున్న మెనూ విధానాన్ని పరిశీలించి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. రోజుకో స్పెషల్‌ కూరతో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న భోజన విధానంపై ప్రభుత్వ కల్పిస్తున్న సదుపాయాలను వారు కొనియాడారు.

చిత్తూరు జిల్లా యాదమరి మండలం కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలను జపాన్‌ దేశస్తులు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో సీనియర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కనకాచారికి జపాన్‌కి చెందిన స్టాన్లీ స్నేహితుడు. కనకాచారి కోరిక మేరకు  క్రిస్మస్‌ వేడుక కోసం స్టాన్లీ అతని జపాన్‌ స్నేహితులు కోటరో, హిరోమి, ష్కాలర్‌ ఇక్కడ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తుండగా అక్కడి వాతావరణాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇంత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేసేదెవరని ఆరా తీశారు. అలాగే పాఠశాలకు కల్పించిన మౌలిక వసతులకు మంత్రముగ్థులై విషయాలన్నీ కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీనివల్ల ఇక్కడి పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయిందని కనకాచారి వారికి  వివరించారు. దీనికోసం సీఎం జగన్‌మోహనరెడ్డి మహోద్యమం చేస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తీసుకొచ్చి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆశ్చర్యం చెందినవారు  వెంటనే అక్కడ అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. ఇంతటి సదుపాయాలు కల్పిస్తున్న సీఎం జగన్‌మోహనరెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.  పాఠశాల హెచ్‌ఎం లలితతోపాటు ఉపాధ్యాయులు ఉన్నారు.

ఇదీ చదవండి: మనసున్న సీఎం వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement