తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 16 గంటల సమయం | Huge Devotees Rush at Tirupati | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 16 గంటల సమయం

Apr 5 2024 7:53 AM | Updated on Apr 5 2024 7:54 AM

Huge Devotees Rush at Tirupati  - Sakshi

తిరుపతి: తిరుమలలో నేడు రద్దీ పెరిగింది. భక్తులతో కంపార్ట్‌మెంట్లలో ఎక్కువ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న  62,549 మంది భక్తులు దర్శించుకున్నారు.

26,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం  8   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..  5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం  3.33  కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement