
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైవోవర్‌పై పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే.. చిన్నకార్లు, ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సిలెండర్ల వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 16న కనకదుర్గ ఫ్లైవోవర్ ప్రారంభమైన విషయం విదితమే. ప్రైవేటు బస్సులు స్వాతి సెంటర్ మీదుగా కొండ తిరిగి రావాల్సిందేనని, రాత్రి 11 గంటల తరువాత లారీలు భారీ వాహనాలను అనుమతిస్తామని అధికారులు వివరించారు.