ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి

Government Is Working For The Welfare Of Aqua Farmers - Sakshi

ఆక్వా రైతుల అవగాహన సదస్సులో అప్సడా రాష్ట్ర వైస్‌చైర్మన్‌ వడ్డి రఘురామ్‌

గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు

ప్రాసెసింగ్‌ ప్లాంట్లు వాటికి అనుకూలమైన రేట్లు నిర్ణయించేవి

రైతుల కష్టాలు తెలిసిన వెంటనే సీఎం జగన్‌ ఎంపవర్‌ కమిటీ వేశారు

రైతుకు గిట్టుబాటు ధర లభించేలా కమిటీ చర్యలు తీసుకుంది

ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా చర్యలు తీసుకుంటాం

10 ఎకరాల్లోపు రైతులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 కే ఇస్తున్నాం

365 రోజూలూ రొయ్యల కొనుగోలు జరుగుతుంది

కాకినాడ సిటీ: ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని అప్సడా (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురామ్‌ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పా­ల్గొ­న్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎ­న్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు వారికి అనుకూలమైన రేట్లు నిర్ణయించే వారన్నారు. ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకున్న 24 గంటల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌రొయ్యలకు గిట్టుబాటు ధర లభించేందుకు మంత్రులు, మత్స్యశాఖ అధికారులు, రైతులతో కలసి ఎంపవర్‌ కమిటీని వేయడంతో ఎన్నడూలేని విధంగా రైతులు పంటను అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు.

ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రోసెసింగ్‌ ప్లాంట్ల యాజమానులతో ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో రొయ్య 100 కౌంట్‌ రూ. 80కు కొనే వారని, ఇప్పుడు అదే కౌంట్‌ రూ. 210కి కొనాలని స్పష్టం చేశారు. రూపాయి తగ్గినా వెంటనే ఎంక్వైరీ కమిటీలో పెట్టి రైతులు, రైతు సంఘాల నాయకులు సమక్షంలోనే నిలదీసే పరిస్థితి ఉందన్నారు.

ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సమావేశంలో రైతుల వినతి మేరకు ఆక్వాజోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకి రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ అక్కడికక్కడే ప్రకటించారన్నారు. గత ప్రభుత్వం­లో జోన్‌ వ్యవస్థ మధ్యలో వది­లేస్తే, సీఎం సుదీర్ఘమైన జోన్ల వ్యవస్థను ఏర్పా­టు చేశారని చెప్పారు. దీని వల్ల 1,08,864 మంది రైతులు ఆక్వా జోన్‌లోకి వచ్చారన్నారు. వీరందరికీ యూ­నిట్‌ విద్యుత్‌ రూ. 1.50కే అందిస్తున్నట్లు తెలి­పారు. పదిరోజులే రొయ్యల కొంటా­రం­టూ కొందరు గుత్తేదారులు చేస్తున్న  ప్రచా­రం­­లో వాస్త­వం లేదని, 365 రోజులూ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు రొయ్యలు కొంటాయని లేల్చి రె­ప్పారు. ఏ విధమైన అపోహలకు తావులేకుండా రైతులు నిర్భయంగా పంటలు పండించాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top