మీ వెంటే మేమంతా

సాక్షి, నెట్‌వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజా సంక్షేమానికై అహర్నిశలూ శ్రమిస్తున్న జగనన్న వెంటే తామంతా నడుస్తామని నాయకులతో ప్రజలు చెబుతున్నారు.
అన్ని జిల్లాల్లో బుధవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. మేనిఫెస్టోలో అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు.