
ఉయ్యూరు(కృష్ణా జిల్లా ): దివంగత ప్రముఖ సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి వుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలను చూసి ఆనందపడేవారని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, పత్రిక మాజీ సంపాదకులు పాటూరు రామయ్య అభిప్రాయపడ్డారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకివ్వడం సీఎం జగన్ ఘనతేనని ఆయన అన్నారు.
విద్య, వైద్య రంగంలో పేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో ఉయ్యూరులో సీపాటూరు రామయ్యను ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సత్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు జగన్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేయటం సరికాదన్నారు.