శాంతిస్తున్న కృష్ణమ్మ | Flood flow to Srisailam and Nagarjunasagar projects has been Decreased | Sakshi
Sakshi News home page

శాంతిస్తున్న కృష్ణమ్మ

Oct 25 2020 3:22 AM | Updated on Oct 25 2020 3:22 AM

Flood flow to Srisailam and Nagarjunasagar projects has been Decreased - Sakshi

శ్రీశైలం డ్యామ్‌ నుంచి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌ (మాచర్ల): కృష్ణమ్మ శాంతిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గింది. శనివారం  జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 1,71,037 క్యూసెక్కులు రాగా.. అంతకుముందు వరకు తెరిచి ఉంచిన 10 గేట్లలో నాలుగు మూసివేసి 6 గేట్ల ద్వారా 1,67,622 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

డ్యామ్‌ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. వరద ప్రవాహం తగ్గుతుండటంతో డ్యామ్‌ గేట్లను మూసివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాగార్జున సాగర్‌ జలాశయానికి 1,60,718 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయ నీటిమట్టం 589.50 అడుగుల వద్ద 310.5510 టీఎంసీలు నిల్వ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement