హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం | Five new judges of Andhra Pradesh High Court take oath | Sakshi
Sakshi News home page

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ప్రమాణం

Oct 6 2026 4:52 AM | Updated on Oct 6 2026 4:52 AM

Five new judges of Andhra Pradesh High Court take oath

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్, జస్టిస్‌ అవధానం హరిహరనాథశర్మ, జస్టిస్‌ యడవల్లి లక్ల్మణరావులతో ప్రమాణం చేయిస్తున్న సీజే జస్టిస్‌ లీసా గిల్‌

సాక్షి, అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయ­మూ­ర్తులుగా జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వీరి చేత ప్రధాన న్యాయ­మూర్తి(సీజే) జస్టిస్‌ లీసా గిల్‌ ప్రమాణం చేయించారు. సోమ­వారం హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణం చేసిన న్యాయమూ­ర్తుల కుటుంబ సభ్యులు, న్యాయ­మూర్తులు, న్యాయ­వా­దులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నా­రు.

అంతకుముందు ఈ ఐదుగురి నియామ­కానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ జి.గోపి చదివి వినిపించారు. ఈ ఐదుగురిలో జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ 2024 అక్టోబర్‌ 28న హైకోర్టు అదనపు న్యాయమూ­ర్తులుగా ప్రమాణం చేశారు. జస్టిస్‌ అవధానం హరిహరనాథశర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. వీరిని అదనపు న్యాయమూర్తుల నుంచి శాశ్వత న్యాయ­మూర్తులుగా నియమించాలని గత నెల 23న సమావేశమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి నేతృత్వంలోని కొలీ­జియం తీర్మానం చేయగా, దానిని ఆమో­దిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement