చిలకపాలెం టోల్‌ప్లాజాలో అగ్ని ప్రమాదం

Fire Accident In Chilakapalem Toll Plaza - Sakshi

గ్యాస్‌ కట్టర్‌ నుంచి రాజుకున్న మంటలు

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: మండలంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్‌ప్లాజాలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా టోల్‌ప్లాజాను అల్లినగరం ప్రాంతానికి తాత్కాలికంగా తరలించారు. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజా నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్‌ కట్టర్‌ నుంచి నిప్పురవ్వలు రాజుకుని ఫైబర్‌ కప్పునకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హైవే పనులు చేస్తున్న అప్కో కాంట్రాక్టు సిబ్బంది వాటర్‌ ట్రాక్టర్లతో ప్రొక్లెయిన్‌ సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక స్టేషన్‌ సిబ్బంది చేరుకుని పూర్తిగా మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మరోవైపు ట్రాఫిక్‌ ఏర్పడకుండా అప్కో కాంట్రాక్టు వర్కర్లు వాహనాలను దారి మరలించారు. ఒకే రోడ్డుపై రాకపోకలు సాగటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top