breaking news
chilakapalem
-
చిలకపాలెం టోల్‌ప్లాజాలో అగ్ని ప్రమాదం
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చిలకపాలెం టోల్‌ప్లాజాలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా టోల్‌ప్లాజాను అల్లినగరం ప్రాంతానికి తాత్కాలికంగా తరలించారు. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజా నిర్మాణాలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ కట్టర్ నుంచి నిప్పురవ్వలు రాజుకుని ఫైబర్ కప్పునకు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో హైవే పనులు చేస్తున్న అప్కో కాంట్రాక్టు సిబ్బంది వాటర్ ట్రాక్టర్లతో ప్రొక్లెయిన్ సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక స్టేషన్ సిబ్బంది చేరుకుని పూర్తిగా మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏర్పడకుండా అప్కో కాంట్రాక్టు వర్కర్లు వాహనాలను దారి మరలించారు. ఒకే రోడ్డుపై రాకపోకలు సాగటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి
చిక్కాలపాలెం (చాగల్లు) :చిక్కాలపాలెం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తండ్రికొడుకులు మ రణించారు. పోలీసులు,స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం కలవలపల్లికి చెందిన చాపల వెంకట్రావు(50), అతని కుమారుడు చాపల రవి(30) ఈ ప్రమాదంలో మృతిచెం దారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో బంధువుల ఇంట్లో వివాహ వేడుకలకు వెళ్లి మోటర్‌సైకిల్‌పై ఇద్దరు తిరిగి వస్తున్నారు. మధ్యలో వెంకట్రావుకు కుమార్తెను చూడాలనిపించటంతో కొవ్వూ రు మండలం వాడపల్లిలో ఉంటున్న ఆమె ఇంటికి బయలుదేరారు. చిక్కాలపాలెం శివారులో రొంపుగుంట చెరువు వద్ద రోడ్డు ప్రక్కన వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తండ్రికొడుకులకు తీవ్రగాయాలై అక్కడక్కడే మరణించారు. వీరు కూలీలు. చాగల్లు పోలీస్‌స్టేషన్ రైటర్ నాగరాజు,హెచ్‌సీ డి.కొటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృత్యువులోనూ కలిసే వెంకట్రావు, రవి స్నేహితుల్లా కలిసిమెలసి ఉండేవారని స్థానికులు తెలిపారు. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఓ అమ్మాయి ఉన్నారు. అతని భార్య మార్తమ్మ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లింది. వెంకట్రావు పెద్ద కుమారుడు రవికి వివాహమైంది. అతనికి భార్య భవాని, ఓ కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కలవలపల్లిలో విషాదచాయలు ఆలముకున్నాయి. ఘటనా స్థలంలో మృతిదేహాలు పడి ఉన్న తీరు చూసిన వారినీ కలచివేసింది.