పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

DEO Lingeshwar Reddy Surprise Inspection At Pendurthi High School - Sakshi

శానిటైజేషన్‌ తర్వాతే విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతి

పెందుర్తి హై స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన డీఈవో లింగేశ్వర్ రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి చేతులు శానిటేషన్‌తో శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అదే సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి టెంపరేచర్‌ను కూడా పరీక్షిస్తారు. అనుమానిత లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి కూడా తల్లిదండ్రుల ద్వారా తీసుకువెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాలోని 942 ప్రభుత్వ పాఠశాలలో ఈ చర్యలు చేపట్టారు.

తాజా అంచనాల బట్టి దాదాపు 98 వేల మంది విద్యార్థులు సగటున ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నట్టు విద్యా శాఖ చెబుతోంది. అదే సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. ప్రతిరోజు కోవిడ్‌ నిబంధనల అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో డీఈవో లింగేశ్వర రెడ్డి తనిఖీలు చేపట్టి కోవిడ్‌ నిబంధనలు అమలు తీరుపై ఆరా తీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top