ఒకే రోజు 10,502 మంది రికవరీ | Coronavirus: 10502 Covid Victims Recovery In A Single Day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 10,502 మంది రికవరీ

Sep 22 2020 4:14 AM | Updated on Sep 22 2020 4:14 AM

Coronavirus: 10502 Covid Victims Recovery In A Single Day - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. సోమవారం ఉదయం 9 గంటల సమయానికి 56, 569 టెస్టులు చేయగా, 6,235 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 51 మంది కోవిడ్‌ వల్ల మరణించారు.

ఇప్పటివరకూ రాష్ట్రంలో 51,60,700 టెస్టులు చేశారు. 6,31,749 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 5,51,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 74,518 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 5,410 మంది కోవిడ్‌తో మృతిచెందారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో మిలియన్‌ జనాభాకు  96,642 టెస్టులు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement