రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం | Corona Vaccine For TTD Employees: YV Subba Reddy | Sakshi
Sakshi News home page

టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌: వైవీ సుబ్బారెడ్డి

Feb 27 2021 3:53 PM | Updated on Feb 27 2021 7:04 PM

Corona Vaccine For TTD Employees: YV Subba Reddy - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమలలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు

అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలల్లో వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి ధరలు పెరుగుతుండటంతో నిల్వ సామర్థ్యం పెంచాలని సూచించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని పేర్కొన్నారు. తిరుమలలోని రెస్ట్ హౌస్‌లు, సత్రాలు, కాటేజీల్లో విద్యుత్ వృథాను నియంత్రించడానికి ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.

కాగా శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని బోర్డులో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. తిరుచానూరు ఆలయ తులాభారం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. శ్రీనివాస మంగాపురంలో అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించగా.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది.

చదవండి:

ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు దురదృష్టకరం

పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement