కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ

Corona Second Wave: Partial Curfew Force InTo Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి త‌ర్వాతి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

బ్యాంక్‌ సేవలు యథాతథం
అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాంక్‌ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. బ్యాంక్ సేవలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిషేధం
కాగా రోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధం. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ అమలవుతుంది. ఆ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్‌ చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది.

అత్యవసర సేవల వాహనాలను మాత్రం అనుమతించనున్నారు. అలాగే మీడియా వంటి అత్యవసర ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఉదయం పూట షాపులు తెరిచే సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయంలో గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయకూడదు. ఈ ఆంక్షలు రెండు వారాలు కొనసాగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తోంది.

స్వీయ ఆంక్షలు
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఇప్పటికే జనం స్వచ్ఛందంగా స్వీయ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో టిఫిన్‌ సెంటర్లు, పాలు, ఇతర నిత్యావసర సరకుల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మంగళవారం వరకూ సాయంత్రం 6 గంటలకే మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల పగలు 12 గంటల తరువాత కొంతవరకూ స్వచ్ఛంద ఆంక్షలు విధించుకోవడంతో సాయంత్రం తర్వాత పట్టణాల్లో జనసంచారం తగ్గుతోంది. మధ్యాహ్నం నుంచి మర్నాడు ఉదయం వరకూ కర్ఫ్యూ విధిస్తే కరోనా వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

చదవండి: Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే..  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-05-2021
May 05, 2021, 14:29 IST
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల పట్ల  సంతృప్తి చెందినవారి శాతంలో 20% కోత పడినా.. మిగతా దేశాధినేతలతో  పోలిస్తే ఆయన...
05-05-2021
May 05, 2021, 14:15 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం రాత్రి కర్ఫ్యూ...
05-05-2021
May 05, 2021, 13:58 IST
కోవిడ్‌ మళ్లీ సోకితే ఏం చేయాలి? వ్యాక్సిన్‌ వేసుకున్నా వస్తుందా? ఇలా జరిగితే ఏదైనా ప్రమాదం ఉంటుందా?
05-05-2021
May 05, 2021, 13:58 IST
సాక్షి, రాయదుర్గం: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు నిండిపోతున్నాయి, చాలా మంది రోగులు ఇళ్లలోనే ఉండి చికిత్స...
05-05-2021
May 05, 2021, 13:16 IST
న్యూఢిల్లీ: మనుషుల జీవితాలను కరోనా వైరస్‌ రెండో దశ అతలాకుతలం చేస్తోంది. ఎలాంటి తారతమ్యం లేకుండా నిండు ప్రాణాలను పొట్టన...
05-05-2021
May 05, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్‌, కోవిడ్‌ మృతుడి అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లో కోవిడ్‌పై ఉన్న భయాన్ని...
05-05-2021
May 05, 2021, 11:42 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు...
05-05-2021
May 05, 2021, 09:51 IST
‘ఉష్ట్రపక్షిలా మీరు ఇసుకలో తలదూర్చగలరేమో కానీ మేమలా చేయలేం
05-05-2021
May 05, 2021, 09:08 IST
సత్తుపల్లిరూరల్‌: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. తీరా పెళ్లి దాకా వచ్చే సరికి ప్రియుడు నిరాకరించటంతో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది....
05-05-2021
May 05, 2021, 08:53 IST
20 ఏళ్లుగా విలక్షణ నటుడు జగపతిబాబు అభిమానిగా ఉన్న శ్రీను గుంటూరులో కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి...
05-05-2021
May 05, 2021, 08:12 IST
కోవిడ్‌ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది.
05-05-2021
May 05, 2021, 07:58 IST
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితులకు ఆక్సిజన్‌...
05-05-2021
May 05, 2021, 03:02 IST
కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
05-05-2021
May 05, 2021, 02:51 IST
ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్‌ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
05-05-2021
May 05, 2021, 02:45 IST
కరోనా బారినపడిన చిన్నారులకు రకరకాల యాంటీవైరల్, యాంటీబయోటిక్స్‌ మందులను ఉపయోగించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
05-05-2021
May 05, 2021, 02:40 IST
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
05-05-2021
May 05, 2021, 02:39 IST
భారత దేశంలో కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్తంత తగ్గింది.
05-05-2021
May 05, 2021, 01:17 IST
వాషింగ్టన్‌: భారత్‌లో కోవిడ్‌ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ...
04-05-2021
May 04, 2021, 20:22 IST
‘మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లైయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పడు నాకు తెలుస్తోంది’ అంటూ...
04-05-2021
May 04, 2021, 19:24 IST
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కేంద్రాలకు  ఉచిత రైడ్లను అందిస్తున్నట్లు ఉబెర్  మంగళవారం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి  టీకా కేంద్రాలకు వెళ్లేవారికి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top