‘మీ అందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం’

CM YS Jaganmohan Reddy Tweet About Parishad Elections Results - Sakshi

‘పరిషత్‌’ ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలవల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది. మీరు చూపించిన ఈ ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషిపట్ల నా బాధ్యతను మరింత పెంచింది’.. అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై ఆదివారం సీఎం ట్వీట్‌ చేశారు. ‘సోమవారం ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి. అప్పుడు మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను’.. అని సీఎం అందులో పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top