యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి: సీఎం జగన్‌

CM YS Jagan Video Conference To Collectors Over Cyclone Effect Area - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. 

సీఎం జగన్ కామెంట్స్..

 • ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది
 • తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి
 • అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి
 • బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి
 • బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి
 • రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి
 • ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి
 • పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి
 • దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి
 • రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు
 • పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి
 • అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి
 • ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి
 • రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
 • వారు అధైర్యపడాల్సిన పనిలేదు
 • ప్రతి రైతునూ ఆదుకుంటుంది
 • పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 
 • సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి.
 • యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి
 • రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి
 • దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి
 • వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి
 • అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. 
 • చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది
 • ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం
 • విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది
 • వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది
 • వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

ఈ సమీక్షలో క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ సివిల్‌ సఫ్లైస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ జి వీరపాండియన్,  గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ బి మహమ్మద్‌ దీవాన్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top