CM Jagan Srikakulam Tour: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

CM YS Jagan to Tour Srikakulam on 27th June - Sakshi

శ్రీకాకుళం నుంచే అమ్మ ఒడి మూడో విడత పంపిణీ 

ఆమదాలవలస– శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం  

సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు సమీక్షించేందుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.  

సీఎం పర్యటన సాగేదిలా.. 
ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, ఎస్పీ రాధిక తదితరులు

ఏర్పాట్లపై సమీక్ష.. 
సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తలశిల రఘురాం, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, ఎస్పీ రాధిక సమీక్షించారు. ముందు గా కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్‌ కళాశాల మైదా నం పరిశీలించారు. అనంతరం హెలీపాడ్‌ స్థలి, సీఎం పయనించే మార్గం, బహిరంగ సభ, లబ్ధిదారులతో ముఖాముఖీ తదితర వాటిపై చర్చించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ బంగ్లాకు చేరుకుని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి పలు సూచన, సలహాలు చేశారు.

కార్యక్రమంలో ధర్మా న రామ్‌ మనోహర్‌నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్‌ అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, డీఆర్‌డీఎ పీడీ బి.శాంతిశ్రీ, ఆర్డీవో బి.శాంతి, శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌ ఓబులేసు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ వడ్డి సుందర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ కాంతిమతి,  డీఈవో పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్‌ పీఓ జయప్రకాష్, డీఎస్పీ మహేంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు మెంటాడ స్వరూప్, జలుమూరు ఎంపీపీ వాన గోపి, శిమ్మ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (28న ప్యారిస్‌కు సీఎం జగన్‌)

సీఎం పర్యటన విజయవంతం చేయాలి  
అమ్మ ఒడి మూడో విడత పంపిణీ, మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాకొస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి లబ్ధిదారులు, పార్టీ శ్రేణు లు హాజరై జయప్రదం చేయాలని కోరారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top