వైఎస్‌ జగన్: భూ సర్వే పైలట్‌ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష | YS Jagan Review Meeting on Comprehensive Land Survey Pilot Project in AP - Sakshi
Sakshi News home page

భూ సర్వే పైలట్‌ ప్రాజెక్టుపై సీఎం జగన్‌ సమీక్ష

Aug 31 2020 2:33 PM | Updated on Aug 31 2020 5:59 PM

CM YS Jagan Review On Comprehensive Land Survey Pilot Project - Sakshi

సాక్షి, తాడేపల్లి: భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టి 2023, ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలకు సంబంధించిన ప్రజెంటేషన్‌ సమర్పించారు.(చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన)
చదవండిఏపీ: రాష్ట్రమంతా భూముల రీసర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement