AP CM YS Jagan: ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి

CM YS Jagan Great Words At Jayaho BC Mahasabha at Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే మాట ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభకు హాజరైన ప్రజల్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 'ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ, వెన్నుపోటుకి మధ్య జరగబోతుందని చెప్పండి. మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి.

ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి. పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ యుద్దంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే.. మరోవైపున బీసీల తోకలను కత్తరిస్తాను, ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న చంద్రబాబునాయుడికి మధ్య యుద్దం జరగబోతుందని చెప్పండి' అంటూ బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపును ఇచ్చారు. 

చంద్రబాబుని నమ్మొద్దు..
ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకూ తీసుకునిపోవాలి. తేడా గమనించమని అందరినీ అడగండి. మీ ఇంట్లోమంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా.. జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా.. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల స్వప్నాలను చూపిస్తాడు.

బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే.. బాబునే ముఖ్యమంత్రి కావాలంటాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలంటాడు. పిల్లలను మన రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా చదివిస్తాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాను అని కూడా అంటాడు. కానీ నమ్మొద్దు. ఒక్కసారి నమ్మాం.. అడుగులు వెనక్కి పడ్డాయి. జగన్‌ని నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన బిడ్డని ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చొబెట్టుకున్నాం. మన బ్రతుకులు మారాయా? లేదా? అన్నది ఒక్కసారి  గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 

చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌)

మన టార్గెట్‌ 175కి 175..
ఇక మీదట నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం. గడప,గడపకూ మీరు కూడా వెళ్లడం మొదలు కావాలి. ఇక నుంచి బూత్‌ కమిటీలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్కచెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు మ్యాపింగ్‌ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం కూడా ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ సారి మన టార్గెట్‌ 175 కి 175 సీట్లు అని గుర్తుపెట్టుకోవాలి.

ప్రతి అడుగు కూడా అదే విధంగా వేయాలని, ఆవిధంగా ప్రయాణం చేయాలని ఇక్కడికివచ్చిన నా 80 వేల మంది బీసీ కుటుంబసభ్యులందరికీ కూడా పేరు, పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ... ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

చదవండి: (చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top