AP Assembly: CM Jagan Releases Welfare Schemes Calendar for 2022-23 - Sakshi
Sakshi News home page

CM Jagan Assembly Speech: సంక్షేమ పథకాల క్యాలెండర్‌.. ఇది పేదవర్గాలకు వెల్‌ఫేర్‌.. చంద్రబాబుకి ఫేర్‌వెల్‌: సీఎం జగన్‌

Mar 25 2022 2:30 PM | Updated on Mar 25 2022 3:54 PM

CM Jagan Releases Welfare Schemes Calendar for 2022 23 - Sakshi

చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఏమాత్రం రుచించని ప్రజా సంక్షేమ పథకాల క్యాలెండర్‌ అని సీఎం జగన్‌ చమత్కరించారు.

సాక్షి, అమరావతి: తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ముగింపు సెషన్‌ సందర్భంగా.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేశారాయన. ఈ సందర్భంగా..

సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను స్వయంగా చదివి వినిపించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. ఇది పేద వర్గాలకు వెల్‌ఫేర్‌ క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, ఆయనకు ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు ఏమాత్రం రుచించని క్యాలెండర్‌ అని, ఒకరకంగా గుబులు పుట్టించే క్యాలెండర్‌ అని వైఎస్‌ జగన్‌ చమత్కరించారు. పైగా ఇది చంద్రబాబుకు ఫేర్‌వెల్‌ క్యాలెండర్‌ అవుతుందని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. 

కరోనా లాంటి సమయంలోనూ.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎక్కడా ఆగలేదని గుర్తు చేశారు సీఎం జగన్‌. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.  సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారాయన. పైగా లబ్ధిదారులు ప్లాన్‌ చేసుకునేందుకు వీలుగానే కాకుండా.. పారదర్శకంగా, అవినీతి, వివక్షకు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ..  భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని సీఎం వైఎస్‌జగన్‌ అన్నారు. మంచి బడ్జెట్‌.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెబుతూ ప్రసంగం ముగించారు. అనంతరం జనరంజకమైన ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2022-23ని రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఆమోదించిన స్పీకర్‌.. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.   

ఏప్రిల్‌ 2022-2023 మార్చి సంక్షేమ పథకాల క్యాలెండర్‌

► 2022.. ఏప్రిల్‌లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు

► మేలో విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, మత్య్సకార భరోసా

► జూన్‌లో అమ్మ ఒడి పథకం

► జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు. 

► ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం.

► సెప్టెంబర్‌లో వైఎస్సార్‌ చేయూత

► అక్టోబర్‌లో వసతి దీవెన, రైతు భరోసా 

► నవంబర్‌లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు

► డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు

►2023.. జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు పథకాలు

► ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు

► మార్చిలో వసతి దీవెన అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement