రాష్ట్రస్థాయిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు 

Chevireddy Bhaskar Reddy entrusted key Responsibilities at state level - Sakshi

సాక్షి, తిరుపతి రూరల్‌: చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీలో కీలకమైన 23 అనుబంధ సంఘాలను చెవిరెడ్డి రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయా సంఘాలను సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయనున్నారు.

గతంలో పార్టీ అప్పగించిన పెనుగొండ మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్, ఆత్మకూరు, బద్వేల్‌ ఎన్నికలు.. ఇలా ఎన్నింటినో ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. వీటితో పాటు పార్టీ ప్లీనరీ నుంచి ఇటీవల వైజాగ్‌లో ప్రధాని మోదీ పర్యటన వరకు ఆయా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు.

ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రతిష్ట పెంచేందుకు సైనికుడిలా పని చేస్తానన్నారు.   

చదవండి: (20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top