శేషవాహనంపై శ్రీరాముడు 

Brahmotsavam begins with Dwajarohanam in Ontimitta Kodandaramaswamy temple - Sakshi

ధ్వజారోహణంతో ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం 

రామతీర్థంలో ఘనంగా సీతారాముల కల్యాణం 

ఒంటిమిట్ట/నెల్లిమర్ల రూరల్‌/సింహాచలం(పెందుర్తి): ఆంధ్ర రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీ కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా స్వామి వారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ఉత్సవ నిర్వాహకులు రాజేష్‌ సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు గరుడ పతాక ప్రదర్శన చేపట్టారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహా్వనించారు. విష్వక్సేన పూజ, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన జరిపారు. బుధవారం రాత్రి జగదభిరాముడు శేషవాహనంపై విహరించారు.  

రామతీర్థంలో వైభవంగా కల్యాణ వేడుక 
విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీ సీతారామస్వామి సన్నిధిలో బుధవారం స్వామివారి కల్యాణం కోవిడ్‌ నేపథ్యంలో ఏకాంతంగానే జరిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆరేళ్లుగా అందజేస్తున్న నేపథ్యంలో వాటిని ఏఈవో రాఘవకుమార్, ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు రామతీర్థం ఆలయానికి సమర్పించారు. వాటిని ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రాములవారికి అందజేశారు. కల్యాణ క్రమంలో ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆశీర్వచన మండపం వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. అక్కడ వెండి మండపం మధ్యభాగంలోని అమ్మవారిని, స్వామివారిని వేంచేపు చేశారు. వేదమంత్రోచ్ఛారణ నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారామస్వామి వార్ల శిరస్సుపై ఉంచారు. శా్రస్తోక్తంగా మాంగల్యధారణ గావించారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top