మనం జీవించే సమాజానికి పునాది వారే

సాక్షి, అమరావతి: రేపు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం రాజ్ భవన్ నుంచి సందేశం ఇచ్చారు. శనివారం(నవంబర్ 14)న పండిట్ జవహర్‌లాల్ నేహ్రు జన్మదినం, ఈ రోజున ప్రతి ఎడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి