కిలకిలరావాల రోజ్‌ పీటర్స్‌.. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ఏరియా కేరాఫ్‌ అడ్రస్‌ | Sakshi
Sakshi News home page

కిలకిలరావాల రోజ్‌ పీటర్స్‌.. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ఏరియా కేరాఫ్‌ అడ్రస్‌

Published Fri, Feb 11 2022 8:35 AM

Birds Flock In Record Numbers on Tree at Vijayawada State Guest House - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ప్రాంతం.. అక్కడ ఏ చెట్టుపై చూసినా పిట్టల గుంపులే. సెల్‌ టవర్లు, విద్యుత్‌ తీగలు ఇలా వాలేందుకు అనువుగా ఉన్న ప్రతిచోటా పక్షుల సందడే. సాయంత్రం అయిందంటే చాలు ఆ ప్రాంతం వేలాదిగా వచ్చే రోజ్‌ పీటర్స్‌ పక్షుల కిలకిలరావాలతో సందడిగా మారిపోతుంది. ఏటా ఇదే సీజన్‌లో వచ్చే ఈ పక్షులకు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ ఏరియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. 


– కందుల చక్రపాణి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, విజయవాడ)

కూర్మం కాదు..కంద!
సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండల గ్రామం ఎరుకలపూడిలో ప్రకృతి రైతు ముళ్లపూడి రంగయ్య వ్యవసాయ క్షేత్రంలో కంద దుంప ఒకటి 17 కిలోల బరువు ఊరింది. ఇది చూడటానికి తాబేలు ఆకారాన్ని పోలినట్లు ఉంది. రంగయ్య తన ఇంటిదగ్గరి క్షేత్రంలో ప్రకృతి పద్ధతుల్లో రకరకాల పండ్లతోపాటు కందను సాగుచేస్తున్నారు. 
– ఎరుకలపూడి (తెనాలి)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement