తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం | Bees Attacked On Elderly Couple In Anakapalle District | Sakshi
Sakshi News home page

తేనెటీగల బీభత్సం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

Mar 26 2023 8:25 AM | Updated on Mar 26 2023 3:02 PM

Bees Attacked On Elderly Couple In Anakapalle District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది.

రావికమతం(అనకాపల్లి జిల్లా): రావికమతం మండలం గర్నికం గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. పొలంలో పనిచేసుకుంటున్న వృద్ధ దంపతులు ఆర్లె కామునాయుడు (61), అతని భార్య నూకాలమ్మ( 57)పై శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వీరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భర్త కామునాయుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందగా, భార్య నూకాలమ్మ అక్కడే చికిత్స పొందుతోంది.

గ్రామానికి సమీపంలో వారి పశువుల పాకలు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం పొలంలో గొర్రెలు కాస్తూ పనులు చూసుకుంటున్న తరుణంలో మేతకు వెళ్లి వచ్చే పశువులు సమీపంలో ఉన్న ఒక చెట్టు వద్ద ఒకదానితో మరొకటి తలపడి అలజడి చేశాయి.
చదవండి: కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు 

దీంతో ఆ చెట్టుపై ఉన్న తేనెపట్టులోని ఈగలు బెదిరి పశువులతోపాటు వృద్ధ దంపతులపైనా గుంపుగా దాడి చేశాయి. దీంతో వారు కేకలు వేయగా సమీపంలోని రైతులు గోనె సంచులు చుట్టుకుని వెళ్లి వారిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ తీసుకువెళ్లారు. కేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కామునాయుడు శనివారం మృతి చెందారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement